నెల్లూరు: పెద్ద రాజుపాలెం గ్రామంలో 9 ఏళ్ల బాలిక పై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే సంఘటన. వాలంటీర్ల ముసుగులో బాలికలు, మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలి.
దిశ చట్టం, 21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం, ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు అంతా ప్రచార ఆర్భాటమే తప్ప జగన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు రక్షణే లేదు. వారం వ్యవధిలోనే మైనర్ బాలికల పై రెండు అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వం మృగాళ్ల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం.