728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు

న్యూఢిల్లీ:
★ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) సమర్పించేందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, సెప్టెంబరు 30 గా ప్రభుత్వం నిర్ణయించింది.

★ కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది.

★ ఈ గడువు 2020 జులై 31వరకు ఉండగా, ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.

★ 2018-19 ఆర్థిక సంవత్సర రిటర్నులు (అసలు, సవరించిన) సమర్పించేందుకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది మూడోసారి.

★ 2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్‌30కి  పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకున్నారు.

★ తదుపరి ఈ గడువును జులై 31కి పొడిగించారు. ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు Rating: 5 Reviewed By: NEWS UPDATE