728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2020

గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది: 32 దేశాల పరిశోధకులు

జెనివా:
★ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని  వందలాది పరిశోధకులు చెబుతున్నారు.

★ ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలిపారు.

★ ఈ మేరకు కరోనా వ్యాప్తిపై సిఫార్సులను సవరించాలని వారు కోరారు.

★ తాజాగా, ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాశారు.

★ కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి దగ్గు, తుమ్ములు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపరల నుంచి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే  చెప్పింది.

★ గాలి ద్వారా ఆ వైరస్‌‌ వ్యాప్తి చెందుతుందన్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయలేదు.

★ ఈ పరిశోధనల వివరాలను పరిశోధకులు కొన్ని రోజుల్లో సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురించనున్నారు.

★ కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు కొత్తగా గుర్తించారు.

★ అయితే, కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయానికి సంబంధించిన ఆధారాలు సరిగాలేవని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది: 32 దేశాల పరిశోధకులు Rating: 5 Reviewed By: NEWS UPDATE