728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ నాడు-నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు ప్రకటించారు.

ప్లాస్మా థెరఫీ విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ‘‘కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేయాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని’’ ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉండరాదని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో భర్తీ వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలి. ఎవరికైనా బెడ్‌ అందుబాటులోకి లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ అలాట్‌ అక్కడ నుంచే జరిగేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హెల్ప్‌ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలని సూచించారు. అధికారులు  సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, బెడ్లు, వైద్యం, ఆహారం, పరిశుభ్రత బాగుందా లేదా అన్నదానిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 Rating: 5 Reviewed By: NEWS UPDATE