728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

బ్రేకింగ్: మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

అమరావతి:
★ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం.

★ మూడు వారాల క్రితం బిల్లులను గవర్నర్ కు పంపిన ప్రభుత్వం.

★ గవర్నర్ ఆమోదంతో ఏర్పాటు కానున్న మూడు రాజధానులు.

★ వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు.

★ దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటుకానుంది.

★ శాశన రాజధానిగా అమరావతి, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి.

★ జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

★ శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు.

★ దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.

★ అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది.

★ ఈ నేపథ్యంలో మూడు వారాల కింద ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది.

★ ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

★ గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బ్రేకింగ్: మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ Rating: 5 Reviewed By: NEWS UPDATE