728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 16, 2020

చిలకలూరిపేటలో నేడు 6 కరోనా కేసులు నమోదు... ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా

చిలకలూరిపేట: పట్టణంలో రోజుకు ఐదు లేదా ఆరు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో మద్దినగర్లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్గా నమోదయ్యాయి. గత నాలుగు రోజుల క్రితం మద్ది నగర్ ఆరవ లైన్ లో నివసిస్తున్న ఆటో మొబైల్ లో పనిచేసే ఒక యువకునికి కరోనా పాజిటివ్  రావడంతో అతనిని కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు.  అతని కాంటాక్ట్ అయినా వారి తల్లిదండ్రులు, అతని భార్య, అతని అన్నకు ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులకు సమాచారం అందింది.

అలానే పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో పనిచేసే ఒక యువకునికి, ఇంకో ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో ఒక కుటుంబంలో నలుగురికి, వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురుకి మొత్తంమీద ఆరుగురికి కరోనా సోకింది.  మొత్తమ్మీద పట్టణంలో ఇప్పటివరకూ ఈ సంఖ్య నేటికీ 59కి చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు 6 కరోనా కేసులు నమోదు... ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా Rating: 5 Reviewed By: NEWS UPDATE