నాదెండ్ల మండలం:
నాదెండ్ల మండలంలోని అమీన్ సాహెబ్ పాలెంలో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ అమీన్ సాహెబ్ పాలెం గ్రామం నర్సారావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉండటంతో రెండు నియోజకవర్గాల మధ్య అధికారులు మా పరిధి కాదంటే మాది కాదని అనటంతో అమీన్ సాహెబ్ పాలెంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు.
చిలకలూరిపేట అర్బన్ పరిధిలో మృతుల వివరాలు:
పట్టణంలోని సుగాలి కాలనీకి చెందిన ఒక మహిళ ఈనెల 14వ తేదీన అనారోగ్యంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. సదరు మహిళకు దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో అనుమానించిన డాక్టర్లు ఆమెకు కోవిడ్ టెస్టులు చేశారు. సదరు మహిళ చికిత్సపొందుతూ ఉండగా ఈ రోజు ఉదయం మృతి చెందింది. ఆ మహిళకు నిన్న ఉదయం కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి.
పట్టణంలోని సుబ్బయ్య తోటకి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 15వ తేదీన మృతి చెందారు. 16 వ తేదీన దహన సంస్కారాలు చేశారు. అయితే ఈ రోజు ఉదయం సదరు మృతి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి.
నాదెండ్ల మండల పరిధిలో మృతుల వివరాలు:
నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో నర్సారావుపేటకు చికిత్స నిమిత్తం వెళ్లగా వైద్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ మహిళకు చికిత్స చేస్తూ కోవిడ్ పరీక్షలు చేయగా ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. అయితే ఆ మహిళ మృతి చెందింది.
పట్టణంలోని ఒక మహిళకు పాజిటివ్ వచ్చిన మరుసటి రోజు మృతి చెందటం, ఒక మహిళ మృతి చెందిన మూడు రోజుల తర్వాత పాజిటివ్ రిపోర్టు రావడం, నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ఒక మహిళ మృతి చెందడం... మొత్తం మీద ఈ రోజు ఇరువురు మహిళలు మృతి చెందారు. మొత్తం మీద ఈ రోజు ఇద్దరు మహిళలు మృతి చెందగా నియోజకవర్గంలో కరోనా మృతుల సంఖ్య 6 కు చేరింది.

