728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2020

చిలకలూరిపేటలో లారీ డ్రైవర్ను కొట్టి 70 వేలు లాక్కెళ్ళి దుండగులు.. విచారణ చేస్తున్న డీఎస్పీ

చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ అన్న క్యాంటీన్ పక్కన ఆగి ఉన్న ఒక డ్రైవర్ వద్ద నుండి కొందరు దుండగులు డబ్బులు లాక్కొని వెళ్లిన సంఘటన రాత్రి 12 గంటలకు జరిగింది.

నర్సారావుపేట సెంటర్ లో ఎస్బీఐ ఎటిఎం వద్ద డబ్బులు డ్రా చేయవచ్చని రాత్రి 12 గంటల సమయంలో అన్నా కాంటీన్ వద్ద ఆగి అతను కూర్చుని ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి అతనిని కొట్టి అతని వద్ద ఉన్న సుమారు 70 వేల రూపాయలను లాక్కుని వెళ్ళినట్లు ఆ వ్యక్తి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు మేరకు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఆ ప్రాంతంలో ఉన్న వారిని విచారిస్తున్నారు. ఆ సంఘటన జరిగిన పరిసర ప్రాంత సీసీ ఫుటేజీ తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో లారీ డ్రైవర్ను కొట్టి 70 వేలు లాక్కెళ్ళి దుండగులు.. విచారణ చేస్తున్న డీఎస్పీ Rating: 5 Reviewed By: NEWS UPDATE