728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 24, 2020

చిలకలూరిపేట పట్టణంలో కరోనాతో మహిళ మృతి... దీంతో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

చిలకలూరిపేట: కరోనా పాజిటివ్ తనకు వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న ఒక మహిళ (55)గంట అనంతరం మృతిచెందిన ఘటన చిలకలూరిపేట పట్టణంలోని సుభానినగర్ లో జరిగింది.

చిలకలూరిపేట పట్టణంలోని సుబానినగర్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక మహిళకు నిన్న సాయంత్రం కరోనా వచ్చిందన్న వార్త తెలియడంతో, అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న తాను దగ్గు రావడంతో ఒక గంట సేపు దగ్గి దగ్గి కుప్ప కూలి తనువు చాలించింది.

కరోనా వచ్చిందన్న సమాచారంతోనే తాను భయ పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది ఈరోజు ఆమె మృతదేహాన్ని తీసుకుని వెళ్లి ఖననం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వచ్చిన వారు గుండె ధైర్యంతో ఉండాలని వైద్యులు ఒక  పక్క చెబుతున్నా అనేకమంది భయంతోనే మృతి చెందుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఇప్పటివరకు చిలకలూరిపేట పట్టణంలో అధికారిక లెక్కల  ప్రకారం సుగాలి కాలనీ లో ఒక మహిళ, సుభాని నగర్ లో ఒక మహిళ, మరియు సుబ్బయ్య తోట కు చెందిన ఒక మహిళ మృతి చెందింది. అనధికారికంగా ఇరువురు వ్యక్తులు వేరు వేరు చోట్ల ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. మొత్తంమీద పట్టణంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో కరోనాతో మహిళ మృతి... దీంతో ఐదుకు చేరిన మృతుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE