చిలకలూరిపేట: నియోజకవర్గం లోని చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో ఒకే రోజులో ఇప్పటివరకు నమోదు కాని విధంగా వేలూరు గ్రామం లో పద్దెనిమిది(18) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఒకే గ్రామంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. నిన్న గ్రామంలో నిర్వహించిన టెస్టుల్లో ఈరోజు భారీగా కేసులు నమోదైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.చిలకలూరిపేట మండలం కోమటినివారిపాలెం గ్రామంలో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో స్పిన్నింగ్ మిల్లు లోని కార్మికులకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది.