728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 24, 2020

చిలకలూరిపేటలో నమోదైన కరోనా కేసుల వివరాలు... లాక్ డౌన్ తో కేసులు తగ్గనున్నాయా❓

చిలకలూరిపేట: నియోజకవర్గంలో కరోనా కల్లోలం మొదలైంది. నిన్నమొన్నటి వరకు నియోజకవర్గంలో రోజుకు  20 నుంచి 25 లోపు నమోదైన పాజిటివ్ కేసులు గురువారం ఒక్క రోజే నియోజకవర్గం మొత్తం మీద 36 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే 36 కేసులు నమోదవడం జరిగింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యురాలు, అధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి చిలకలూరిపేటలో ఈ నెల 24 నుంచి నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జిల్లా కలెక్టర్ చే జారీ చేయించారు.

నియోజకవర్గంలోని మొత్తం కరోనా కేసుల వివరాలు:
చిలకలూరిపేట పట్టణంలో 146, ఎడ్లపాడు మండలంలో  52, నాదెండ్ల మండలంలో 38, చిలకలూరిపేట రూరల్లో 19 కరోనా కేసులు నమోదు కాగా మొత్తంమీద ఈ సంఖ్య సుమారు 257 చేరింది.

ఇక నియోజకవర్గం మొత్తం మీద కరోనా మృతుల సంఖ్య సుమారుగా ఎనిమిదికి చేరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఏదిఏమైనప్పటికీ నియోజకవర్గంలో కరోనా విలయతాండవం ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే చుట్టుపక్కల నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, గుంటూరు ప్రాంతాలతో పోలిస్తే ఒక రకంగా చిలకలూరిపేటలో కరోనా కేసులు తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ చిలకలూరిపేటలో ఇప్పటిదాకా వచ్చిన కేసుల ప్రైమరీ కాంటాక్ట్ పరీక్షలు చేస్తే గాని చిలకలూరిపేటలో ఏ స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల ఉంటుందో ఊహించుకోవచ్చు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నమోదైన కరోనా కేసుల వివరాలు... లాక్ డౌన్ తో కేసులు తగ్గనున్నాయా❓ Rating: 5 Reviewed By: NEWS UPDATE