728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులు... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

ఉత్తరప్రదేశ్:
★ అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు.

★ అయితే కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా భౌతిక దూరం పాటించేందుకు ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు నిర్ణయించింది.

★ కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేసింది.

★ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది.

★ ‘150 మంది అతిథులు సహా 200 మందికి మించి భూమిపూజలో పాల్గొనకూడదని నిర్ణయించాం’ అని ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌గిరి బుధవారం వెల్లడించారు.

★ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

★ భూమిపూజకు ముందు ప్రధాని మోదీ మందిరంలోని రాముడికి పూజ చేయనున్నారు.

★ హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకోనున్నారు.

★ రామమందిరం ఉద్యమంతో ముడిపడి ఉన్న ప్రముఖులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కతియార్‌లకు ఆహ్వానం పంపనున్నట్లు గతంలో ట్రస్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా వారి రాకపై ఇంకా స్పష్టత రాలేదు.

★ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ను ఆహ్వానిస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులు... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం Rating: 5 Reviewed By: NEWS UPDATE