728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

దిగొచ్చిన ట్రంప్ సర్కారు... విద్యార్థి వీసాలపై నిబంధనల ఎత్తివేత!

వాషింగ్టన్: యూఎస్ లోని పలు యూనివర్శిటీలు, టెక్నాలజీ దిగ్గజాలు తీసుకువచ్చిన ఒత్తిడి, పెట్టిన కేసులతో ట్రంప్ సర్కారు దిగి వచ్చింది. ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ, తీసుకుని వచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. జూలై 6న యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఈ ఆదేశాలను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మరో 17 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, వర్శిటీలను తిరిగి తెరిచే విషయంలో యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉండి, ఆన్ లైన్ క్లాసులను ప్రవేశపెట్టగా, విద్యా సంస్థలపై ఒత్తిడిని పెంచేలా ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దిగొచ్చిన ట్రంప్ సర్కారు... విద్యార్థి వీసాలపై నిబంధనల ఎత్తివేత! Rating: 5 Reviewed By: NEWS UPDATE