గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పంజా విసురుతుంది. అన్ లాక్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి కరోనా తన ప్రతాపం చూపిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గంపై విరుచుకు పడుతుంది. ఈ సంవత్సరం మార్చి 23వ తేదీ నుండి ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం విదితమే. లాక్‌డౌన్ అమల్లో ఉన్నంతకాలం కేవలం నియోజకవర్గం మొత్తం మీద 10 నుండి 20 లోపు మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నియోజకవర్గంలో 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
లాక్ డౌన్ ప్రభుత్వం ఎత్తివేయడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో 48 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నాదెండ్ల మండలంలో 16, ఎడ్లపాడు మండలంలో 26, చిలకలూరిపేట రూరల్ మండలంలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటివరకు 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇంకా టెస్ట్లు చేపించుకున్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో ఇంకా ఎంత మందికి కరోనా పాజిటివ్ వస్తుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నియోజకవర్గంలో కరోనాతో ముగ్గురు మృతి..
కరొనతో మొట్టమొదటి మరణం నాదెండ్ల మండలం చందవరము గ్రామానికి చెందిన వృద్దునిది కాగా, రెండవ మరణం చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామానికి చెందిన మహిళది. మూడో మరణం ఆదివారం నాడు ఎడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన వృద్ధుడిది. అయితే వీరిలో నాదెండ్ల మండలం చందవరం, ఎడ్లపాడు మండలం జలాది గ్రామానికి చెందిన ఇరువురి రిపోర్టులు వారు మృతి చెందిన తరువాత వచ్చాయి.
ఏది ఏమైనప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటి వరకు 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు వయసు పైబడినవారు కరోనా కాటుకు బలయ్యారనే చెప్పవచ్చు.