728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 28, 2020

కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌మావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రజిని

చిల‌క‌లూరిపేట‌: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ‌డిచిన వారం రోజుల నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంద‌ని చెప్పారు. ఎవ‌రికి కోవిడ్ సోకిందో, లేదో గుర్తించ‌డం క‌ష్టంగా ఉంటోంద‌న్నారు. ప్ర‌జ‌లు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నార‌ని, ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యం చోటుచేసుకుంటోంద‌ని వెల్ల‌డించారు. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోనే కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్షా కేంద్రాన్ని నెల‌కొల్పాల‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే ప్రైవేటు ఆస్ప‌త్రుల ఆధ్వ‌ర్యంలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా చూడాల‌న్నారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కు ప‌రీక్ష‌లు చేయించుకునే వీలు క‌ల్పించాల‌ని చెప్పారు. ఏ ఆస్ప‌త్రులు అందుకు అనువుగా ఉన్నాయో గుర్తించి క‌రోనా ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయాల‌ని సూచించారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ప‌ట్ట‌ణంలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన క్ర‌మంలో ఎక్క‌డా నిబంధ‌న‌లు బేఖాత‌రు కాకుండా పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ప‌నిచేయాల‌ని తెలిపారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు విష‌యంలో ఆలోచించొద్ద‌ని చెప్పారు.

స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో పేట‌లోనే క‌రోనా ప‌రీక్ష‌లు, ఫ‌లితాలు చెప్పేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆర్డీవో వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ఇప్ప‌టికే రెండు ఆస్ప‌త్రుల నుంచి కోవిడ్ ప‌రీక్షా కేంద్రం కోసం అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయ‌ని, ప‌రిశీలించి వీటికి అనుమ‌తులు మంజూర‌య్యేలా చూస్తామ‌ని తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే చిల‌కలూరిపేట ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించారు. లాక్‌డౌన్ అమ‌లును క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌మావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE