చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలో కరోనా మృతుల సంఖ్య రోజుకోకటి నమోదుతూనే ఉంది. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నివసించే ఒక వ్యక్తి ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఒక మహిళ గత మూడు రోజుల క్రితం గుంటూరు GGH లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది.
చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణారెడ్డి దొంకలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఈనెల 25వ తేదీన మృతిచెందాడు. అయితే అతను మృతి చెందక ముందే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ రోజు టెస్ట్ రిజల్ట్ రావడంతో ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఏదేమైనప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. అయితే ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిన విషయమే తెలీకుండా మృతిచెందాడు. దీనితో నేడు కరోనాతో మృతి చెందినవారు ముగ్గురయ్యారు.