728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 10, 2020

కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్‌: కజకిస్థాన్‌లోని చైనా ఎంబసీ హెచ్చరికలు

కజకిస్థాన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్‌-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను హెచ్చరించింది. (భయపెట్టే వార్త చెప్పిన చైనా!)

ఈ మేరకు.. ‘‘కజకిస్థాన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ కంటే అంతుపట్టని న్యుమోనియాతో సంభవిస్తున్న మరణాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్నెళ్లుగా 1772 మంది మరణించారు. ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారు. ఇందులో చైనీయులు కూడా ఉన్నారు. ఈ దేశ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వైరస్‌ ఆనవాలును కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతరకు దానిని గుర్తించలేకపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’అని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్‌: కజకిస్థాన్‌లోని చైనా ఎంబసీ హెచ్చరికలు Rating: 5 Reviewed By: NEWS UPDATE