చిలకలూరిపేటలో మాస్కు లేకుండా జనం బయట తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా
చిలకలూరిపేట: పట్టణంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరిగి పోతున్నాయని చిలకలూరిపేట నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, మాస్కు ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని ఆయన అన్నారు. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక దూరం పాటించాల్సిందేనని ఈ విషయంపై అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి ఒక కరోనా కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వీరు స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో ప్రజలందరూ సహకరించి భౌతిక దూరం పాటించి బయట తిరగకుండా ఉండవలసిందిగా డాక్టర్ గోపీనాయక్ ప్రజలను కోరారు.