728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 28, 2020

చిలకలూరిపేట అమ్మాయిని, పర్చూరు అబ్బాయిని ఒక్కటి చేసిన కరోనా

గుంటూరు జిల్లా: కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లో ఉండటం, హోమ్ ఐసోలేషన్ లో ఉండటం, ఆస్పత్రిలో చికిత్స పొందటం అనేక రకాలుగా జనం ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కరోనాతో మృత్యువాత పడిన వారు అనేకమంది. అయితే ఇక్కడ కరోనా రావటంతో వారు ఇరువురు ఒకటయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఒక యువకునికి కరోనా పాజిటివ్ రావడంతో గుంటూరులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అలానే చిలకలూరిపేటకు చెందిన ఒక యువతికి కరోనా పాజిటివ్ రావటంతో గుంటూరులోని అదే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్ళింది. ఈ యువతికి ఆ యువకుని పక్క బెడ్ వచ్చింది.  వారిరువురు ఒకరినొకరు మాట్లాడుకుంటూ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరికి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా ఈ యువకుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా, ఆ యువతి ఉద్యోగాన్వేషణలో ఉంది. మరెందుకు ఆలస్యం అనుకున్నారు ఇరువురు... పెద్దలతో మాట్లాడారు.. ఒకటే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఎవరు అడ్డు చెప్పలేదు.  ఈనెల 25వ తేదీన పొన్నూరులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు.

కరోనాతో కుటుంబాలు విడిపోవడం జరుగుతున్న ఈ తరుణంలో ఇక్కడ కరోనా వల్ల వీళ్ళు ఇద్దరు ఒకటయ్యారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట అమ్మాయిని, పర్చూరు అబ్బాయిని ఒక్కటి చేసిన కరోనా Rating: 5 Reviewed By: NEWS UPDATE