చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. లింగంగుంట్ల గ్రామంలో ఒకే ఇంట్లో ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ముగ్గురికి, సాతులూరు గ్రామంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది.
ఎడ్లపాడు మండల పరిధిలో నిన్న 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపిన అధికారులు, కొన్ని అడ్రస్లు తప్పు కారణంగా వేరే మండలాల ప్రజల రిపోర్టులు తమ మండలానికి వచ్చినట్లు, మొత్తం మీద 22 మందికి కరోనా పాజిటివ్ రాలేదని, ఎడ్లపాడు మండలంలో 16 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని ఈ రోజు అధికారికంగా అధికారులు ప్రకటించారు.