728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలి: చంద్రబాబు

అమరావతి:
★ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన ప్యాకేజి, రాంకీ సాల్వెంట్ బాధితులకు కూడా ఇవ్వాలి.

★ టిడిపి, సిపిఐ, బిజెపి, జనసేన, కార్మిక సంఘాల నాయకుల నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం.

★ సాల్వెంట్ కంపెనీ బాధ్యులను అరెస్ట్ చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన చంద్రబాబు.

★ పాలకుల బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారింది.

★ పారిశ్రామిక భద్రతను పెనుప్రమాదంలో పడేశారు. వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు.

★ విశాఖ కంపెనీల్లో విస్ఫోటనాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?

★ మీ బాధ్యతారాహిత్యానికి హద్దు అదుపు లేదా..?

★ రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్ పరిశ్రమ పేలుడుకు బాధ్యులపై చర్యలు తీసుకోరా..?

★ రియాక్టర్ వద్ద ఉష్ణోగ్రతలు, వాక్యూమ్ క్రమబద్దీకరణ బాధ్యత కంపెనీది కాదా..?

★ తన కొడుకు లోన మంటల్లో ఉన్నాడని గేటువద్ద రోదిస్తున్న తల్లి ఆవేదన పట్టదా..?

★ రెవిన్యూ, పోలీసు అధికారులు కంపెనీలో ఉండి ఈ తతంగం అంతా నడిపిస్తారా..?

★ కుటుంబ సభ్యులు తెల్లవార్లూ గేటు వద్ద ధర్నా చేస్తుంటే మృతదేహాన్ని వాళ్లకు చూపించరా..?

★ దొడ్డిదారిన మృతదేహాన్ని ఆసుపత్రికి పంపిస్తారా..?

★ 6 గంటల పాటు టిడిపి, సిపిఐ, బిజెపి, జనసేన, కార్మిక సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తారా..?

★ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తారా..?

★ ప్రమాదానికి కారకులను వదిలేసి పరామర్శకు వెళ్లిన వాళ్లను అరెస్ట్ చేస్తారా..?

★ ప్రజలకు అండగా ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా...?

★ ప్రజా ప్రతినిధులను నిర్బంధించడం కోసమేనా ఒక్కఛాన్స్ ఇవ్వాలని అడిగింది..?

★ సీఎం జగన్ బాధ్యతారాహిత్యం వల్లే విశాఖలో వరుస ప్రమాదాలు.

★ పాలకుల బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారడం బాధాకరం.

★ 68రోజుల్లో 3దుర్ఘటనలు, 15రోజుల్లో ఫార్మాసిటిలోనే 2ప్రమాదాలు జరిగినా మొద్దునిద్ర నుండి మేల్కొనరా?

★ ఎల్జీ పాలిమర్స్  తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోరా?

★ మీరు తప్పులు చేసి టిడిపిపై నిందలు వేస్తారా..?

★ మీ చేతగానితనానికి టిడిపిని నిందించడం హేయం.

★ రాంకీ ఫార్మాసిటి సాల్వెంట్ పరిశ్రమలో మృతుడి కుటుంబానికి రూ కోటి పరిహారం చెల్లించాలి.

★ గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలి.

★ ఎల్జీ పాలిమర్స్ మృతులు, క్షతగాత్రులకు ఇచ్చిన ప్యాకేజియే సాల్వెంట్ బాధితులకు కూడా అందించాలి.

★ రాంకీ సాల్వెంట్ ప్రమాద బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలి: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE