728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

వాట్సప్‌లో గంట సేపు సాంకేతిక లోపం... మెసేజ్‌లు సెండ్‌ కాని వైనం

వాట్సప్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా భారత కాలమాన ప్రకారం గత రాత్రి ఒంటి గంట నుంచి దాదాపు గంట సేపు ఆ యాప్‌ పని చేయలేదు. ఆ సమయంలో ఆ యాప్‌ను వాడడానికి ప్రయత్నించిన యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

పర్యవసానంగా 200 కోట్ల మంది యూజర్ల మొబైల్ ఫోన్లలో వాట్సప్‌ పని చేయలేదు. అనంతరం వాట్సప్ సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించి, సర్వీసును తిరిగి పునరుద్ధరించారు. ఈ సాంకేతిక సమస్య వల్ల దాదాపు గంట సేపు వాట్సప్‌ యూజర్లు సందేశాలు పంపలేకపోయారు, అలాగే రిసీవ్ చేసుకోలేకపోయారు.

ఆ సమయంలో వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ అయి.. పాత మెసేజ్‌లు కనపడినప్పటికీ, కొత్తవి పంపలేకపోయారని నిపుణులు వివరించారు. ప్రస్తుతం తిరిగి వాట్సప్‌లో ఎప్పటిలాగే సేవలు కొనసాగుతున్నాయి. వాట్సప్‌లో ఓ ఇంటర్నల్‌ అప్‌డేట్‌ కారణంగా ఈ రోజు తెల్లవారుజామున యూజర్లకు ఈ అసౌకర్యం కలిగిందని వాట్సప్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

తాము ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని, యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. వాట్సప్‌లో ఇటువంటి లోపాలు తలెత్తడం చాలా అరుదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఇటువంటి లోపం తలెత్తింది. ఈ రోజు తెల్లవారు జామున వాట్సప్‌లో తలెత్తిన ఈ లోపం కారణంగా ముఖ్యంగా అమెరికా, యూకేల్లో యూజర్లు చాలా సేపు అసౌకర్యానికి గురయ్యారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వాట్సప్‌లో గంట సేపు సాంకేతిక లోపం... మెసేజ్‌లు సెండ్‌ కాని వైనం Rating: 5 Reviewed By: NEWS UPDATE