728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

చిలకలూరిపేట ఎక్సైజ్ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్

చిలకలూరిపేట: పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్(54) కు  కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు ఉద్యోగి నరసరావుపేటలో నివాసముంటు చిలకలూరిపేటలో విధి నిర్వహణలో భాగంగా రోజు వచ్చి పోతూ ఉంటాడు.

ఆ ఉద్యోగి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో నర్సారావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ ఉద్యోగి గత వారం నుండి సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిలకలూరిపేట ఎక్సైజ్ శాఖలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగికు కరోనా పాజిటివ్ రావడంతో ఈ ఎనిమిది మంది ఉద్యోగులు కూడా టెస్ట్ చేయించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మొన్నటివరకు రూరల్ పోలీస్ స్టేషన్ కు పాకిన కరోనా నేడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కూడా పాకింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట ఎక్సైజ్ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE