728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 21, 2020

చిలకలూరిపేట: అవ‌గాహ‌న లేమితో కరోనాతో మృత్యువుకు చేరువౌతున్న ప్రజలు

చిలకలూరిపేట: కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయమే తెలియట్లేదు. కొంతమందికి కరోనా  కాటువేసిందని తమ జీవితం అంతం అవుతుందని తెలుస్తుంది... ఇలా కొందరి జీవితాల్లో అనేక ర‌కాలుగా  కరోనా కాటు వేస్తుంది. కొంతమందికి కరోనా వచ్చిందనే భయంతోనే వారి గుండె ఆగుతుంది. ఇలా చూస్తే  కొందరి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఒక వైపు ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో అనేక విధాలుగా ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటే... అవ‌గాహ‌న లోపంతో అనేక మంది మృత్యువుకు చేరువౌతున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర జ్వరం ఉండటంతో అతను చికిత్స చేయించుకోకుండా గత నాలుగు రోజుల క్రితం వారి బంధువైన ఒక వైద్యుని వద్దకు చికిత్స కోసం ఇతర జిల్లాకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైద్యుడు ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఈ లక్షణాలన్నీ కరోనా  పాజిటివ్ లక్షణాలని చెప్పి అతనిని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోమని చెప్పాడు.

వెంటనే సదరు వ్యక్తి అంబులెన్సులో  గుంటూరు జి.జి.హెచ్ వరకు వచ్చాడు. అయితే ఆసుపత్రిలో కి వెళ్లకుండా ఆసుపత్రి బయటే ప్రాణం విడిచాడు. అతని మృతదేహాన్ని తన స్వగ్రామమైన అమీన్ సాహెబ్ పాలెం గాని తమ బంధువుల ఇళ్ళ గాని తీసుకురావడానికి ఎవరు ఒప్పుకోలేదు. అతని మృతదేహాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల్లోని స్మశానవాటికలో ఖననం చేశారు.

సదరు వ్యక్తి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ జ్వరం వచ్చిన పరీక్షలు చేపించుకోకుండా  అనుమానం తో ఆస్పత్రికి వెళుతూ వెళుతూ ఆస్పత్రి బయట ప్రాణాలు విడిచి పెట్టటం బాధాకర విషయం. కనీసం ఆ వ్యక్తి కోవిడ్  పరీక్షలు చేయించుకుంటే ప్రాణమైనా దక్కేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అవ‌గాహ‌న లేమితో కరోనాతో మృత్యువుకు చేరువౌతున్న ప్రజలు Rating: 5 Reviewed By: NEWS UPDATE