చిలకలూరిపేట: నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత వారం నుండి చిలకలూరిపేట పట్టణం, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం కొంత ఆందోళన కలిగిస్తుంది.
చిలకలూరిపేట పట్టణంలో 20వ తేదీ వరకు 110 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలంలో 37, నాదెండ్ల మండలంలో 27, చిలకలూరిపేట రూరల్ లో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నియోజకవర్గ పరిధిలో ఈ సంఖ్య 20 తేదీ నాటికి 182కు చేరుకుంది.
అయితే చిలకలూరిపేట పట్టణంలో మొదటి కరోనా కేసు శివాలయం వీధి పక్కన ఒక వైద్యురాలికి నమోదు కాగా కిలోమీటర్ మేర బారికేడ్లు కట్టిన మున్సిపల్ అధికారులు, ప్రస్తుతం ఒక బజార్లో ఒకే ఇంట్లో ఐదుగురికి, ఒకే బజార్లో అధిక సంఖ్యలో కేసులు నమోదైన కానీ కనీస చర్యలు లేవని, బారికేడ్లు బదులు పిచ్చి కంప వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న కనీసం అధికారులు ఆ ప్రాంతంలో, కరోనా వచ్చిన ఇంట్లో జనం బయట తిరగకుండా కట్టడి చేయలేక పోతున్నారని.. బారికేడ్లు లేకుండా పిచ్చి కంప వేయటం వల్ల పిచ్చి కంప తొలగించి జనం యధాతథంగా నడుస్తున్నారని చెబుతున్నారు.
ఒకప్పుడు కరోనా పాజిటివ్ వస్తే ఆ వీధి మొత్తం పిల్లలు, గర్భిణులకు, వృద్దులకు వైద్యాధికారులు కోవిడ్ టెస్ట్లు చేసేవారు. కానీ నేడు కిట్లు లేక, రాక, అనుమానితులు మాకు టెస్ట్ చేయండి అంటున్న టెస్ట్లు చేసే నాధుడే కరువయ్యారు. ఒకప్పుడు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు టెస్ట్ చేసే వైద్యాధికారులు, నేడు రెండు ప్రాంతాల్లో ఒక రోజు చొప్పున 200 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా కరోనా విజృంభిస్తుంది. అధికారులు చర్యలు అంతంత మాత్రం తీసుకోవడం వల్ల నియోజకవర్గంలో ఏ స్థాయిలో కరోనా ఉందొ ఊహించటం కూడా కష్టం అని విశ్లేషకులు భావిస్తున్నారు.