★ "దిశ" చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది.
★ మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి?
★ రాజమహేంద్రవరంలో ఒక మైనర్ దళిత బాలికను 4 రోజులపాటు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడి... చివరికి నిందితులే బాధిత బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి... పోలీసులనే సవాల్ చేసారంటే... రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో చూడండి.
★ చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో బాలిక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరులో మరో మహిళపై అత్యాచారాలు.. ఇప్పుడీ దళిత మైనర్ బాలిక.
★ 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్ లు..
★ నెల్లూరులో మహిళా ఎంపిడివోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్ పై దౌర్జన్యాలు, మాస్క్ పెట్టుకోమన్న మహిళా ఉద్యోగిని పై ప్రభుత్వ కార్యాలయంలోనే భౌతికదాడి,...ఇవన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ట?
★ పాలకులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే. దాని దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయి.
★ ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి.
★ బాధితులకు న్యాయం చేయాలి.
★ బడుగు బలహీన వర్గాల పేదల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని అన్నారు.

