విశాఖపట్నం: నగరంలోని ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు సంభవించింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫార్మసిటిలో ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లో 65 మంది ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు, పార్మాసిటీలో మొత్తం 85 కంపినీలు ఉన్నాయి మంటలు వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇంకా మంటలు అదుపులోకి రానేలేదు, లోపల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.. పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు, మొత్తం 12 ఫైర్ ఇంజన్ల్ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి అయినా ఎ మాత్రం అదుపులోకి రావడం లేదు
July 14, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: విశాఖపట్నం ఫార్మాసిటీలో భారీ పేలుడు
Rating: 5
Reviewed By: NEWS UPDATE


