728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 14, 2020

చిలకలూరిపేట పట్టణంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  పట్టణంలోని కృష్ణ నగర్ కు చెందిన ఒక యువకునికి (24) కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఆ యువకుడు హైదరాబాద్ నుండి  చిలకలూరిపేటకు వచ్చినట్లు తెలిసింది. ఇతనికి  హైదరాబాద్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అలానే పట్టణంలోని సుభాని నగర్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇరువురు వ్యక్తులకు  కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో తండ్రి (54)కుమార్తె (25)ఇరువురికి ఒకే కుటుంబంలో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పట్టణంలోని చీరాల రోడ్  సుందర్ రెడ్డి హాస్పిటల్ సమీపంలో ఒక యువకునికి (30) కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తంమీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిని కోవిడ్ కేర్ సెంటర్ కు అధికారులు తరలించనున్నారు ఆ ప్రాంతంలో అధికారులు బ్లీచింగ్ చెల్లించి హైపోక్లోరైడ్ సోడియం పిచికారీ చేయనున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE