728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2020

హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉంది: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ:
★ ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

★ పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్నారు.

★ కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సూచించారు.

★ కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని, తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు.

★ పాత సచివాలయంలో 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావొచ్చన్నారు.

★ ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.

★ లాక్‌డౌన్ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కిషన్‌రెడ్డి చెప్పారు.

★ మాజీ ప్రధాని పీవీకి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు అంగీకరించిన ప్రధానికి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉంది: కిషన్‌రెడ్డి Rating: 5 Reviewed By: NEWS UPDATE