చిలకలూరిపేట: పట్టణం లో ఇంకొక వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదు అయింది. పద్మశాలిపేటకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాదు వెళ్లి వచ్చారు. అయితే అతని కుమారుడు మరియు ఆ వ్యక్తి భార్యకు ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కరోనా టెస్టుల్లో తేలింది. ఈ మహిళకు సుమారు అరవై తొమ్మిది సంవత్సరాలు ఉండవచ్చు. ఈమె కుమారునికి 43 సంవత్సరాలు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారానే అతని కుమారునికి అతని భార్య పాజిటివ్ వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంమీద పట్టణంలోని పద్మశాలి పేట లో ఒకే కుటుంబంలో ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కోవిడ్ టెస్ట్లు నిర్వహించనున్స్ట్లు వైద్యులు తెలిపారు.
మొత్తంమీద పట్టణంలోని పద్మశాలి పేట లో ఒకే కుటుంబంలో ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కోవిడ్ టెస్ట్లు నిర్వహించనున్స్ట్లు వైద్యులు తెలిపారు.