చిలకలూరిపేట: నియోజకవర్గస్థాయిలో 104, 108 వాహనాలు ప్రారంభం
కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ సమయంలో ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రారంభించడం సామాన్య విషయం కాదని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలోని మార్కెట్ యార్డులో శనివారం నియోజకవర్గానికి వచ్చిన నూతన 104, 108 వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు సిస్టమ్, వెంటిలేటర్లు, ఇతర ఆధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌లను ప్రారంభించి తమ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ఇకపై ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సత్వరమే అందుతాయమన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి జాతీయస్థాయిలో సామాజికవేత్తలు, వైద్య నిపుణులు ప్రశంసించారని తెలిపారు. అంబులెన్స్ సర్వీసులను స్థానిక ఆరోగ్య కేంద్రాలతో అనే ఆలోచన చేసిన తొలి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని కొనియాడారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఫోన్ చేస్తే సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకాన్ని కలిగించామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 12 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాలకు 20 నిమిషాలు, ఏజెన్సీలకు 25 నిమిషాల్లో 108 అంబులెన్స్‌లు వచ్చేలా ఏర్పాటుచేయగలిగిన ప్రభుత్వం తమదని చెప్పారు. కోవిడ్ వ్యాధి నియంత్రణలోనే ప్రపంచానికే మార్గం చూపేలా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కనీవిని ఎరుగని రీతిలో పరీక్షలు చేస్తున్న ప్రభుత్వంగా ఏపీ నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,పార్టీ అధికార ప్రతినిధి షేక్ దరియావలి,పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలకోటినాయక్,పట్టణ యస్.సి సెల్ అధ్యక్షుడు బండారు వీరయ్య, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు గుంజి వీరాంజనేయులు, పార్టీ నాయకులు కొలిశెట్టి శ్రీనివాసరావు,కాట్రగడ్డ మస్తాన్ రావు,తోట బ్రహ్మాస్వాములు,మాదం శ్రీనివాసరావు,ఆముదాలపల్లి అంజి,రత్నారెడ్డి,కొచ్చెర్ల జాన్సన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.