గత నెల క్రితం వైసీపీ కార్యకర్త గంట హరికృష్ణ తల్లి మృతిచెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎంపీ కృష్ణదేవరాయలు నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామానికి విచ్చేశారు. ఆయనను తన ఇంటికి రమ్మని సింగారెడ్డి కోటిరెడ్డి కోరగా తాను మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సొంత కార్యక్రమం మీద వచ్చానని ఇది పార్టీ కార్యక్రమం కాదని ఎంపీ కృష్ణదేవరాయలు కోటిరెడ్డి బదులిచ్చారు.
వైసీపీ నేత కోటిరెడ్డి వర్గీయులు ఎంపీ కారును అడ్డగించారు. ఇది సుమారుగా మధ్యాహ్నం 1.45 సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు, నాదెండ్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ కార్ను అడ్డగించిన వారిని పక్కకు లాగి కారుపోయే ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం వైసీపీ నేత హరికృష్ణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఎంపీ కృష్ణదేవరాయలు వెళ్ళిపోయారు.
