728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 12, 2020

చిలకలూరిపేట: ఇసుక లేక.. రాక.. పస్తులతో భవన నిర్మాణ కార్మికులు

చిలకలూరిపేట: ఇసుక ఈ పదం తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు... ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు పనిచేసేది ఇసుక తోనే... భవన నిర్మాణం చేపట్టాలంటే మొదట ఇసుక కావాలి. ఇసుక ఉంటే పని ప్రారంభించొచ్చు. దీంతో దానిపై ఆధారపడి బతికే ఇతర వర్కర్లు ఉంటారు. సెంట్రింగ్, రాడ్ బెండింగు, తాపీ మేస్త్రి, వెల్డింగ్ పనివారు, వడ్రంగి పని,  సున్నం వేసేవారు, గ్రానైట్ పనిచేసేవారు, ఎలక్ట్రిషన్ పని, ప్లంబింగ్ వర్కర్స్ ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూపోతే ఈ భవన నిర్మాణానికి 24 రకాల పని వాళ్లు అవసరం అవుతారు.

అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడింది. దీనితో చిలకలూరిపేటలో కూడా అదే స్థాయిలో ఇసుక కొరతతో పనులు లేక కార్మికులు అల్లాడుతున్నారు. ఇసుక ఉంటే పనులు చేసుకుంటూ తమ జీవితం చక్రం లాగే వారు. ప్రస్తుతం ఇసుక లేక కరోనాతో లాక్ డౌన్ లతో తాపీ మేస్త్రితో సహా ఇతర పనివాళ్ళు కూడా అతి భారంగా తమ జీవనాన్ని గడుపుతూ, అప్పుల పాలౌతున్న  విషయం విదితమే.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కోసం కొన్ని పాయింట్లు పెట్టి ఇసుకను తరలించి సచివాలయం ద్వారా బుక్ చేసుకుని ఇసుక పొందవచ్చని చెప్పింది. చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ లో ఇసుకను తీసుకు వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా నేటికీ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ఇంకా అధికారులు కల్పించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా భవన నిర్మాణానికి ఇసుక అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు అధికారులను కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఇసుక లేక.. రాక.. పస్తులతో భవన నిర్మాణ కార్మికులు Rating: 5 Reviewed By: NEWS UPDATE