కరోనా మహమ్మారిపై ప్రపంచం విజయం సాధించాలని, మన దేశం శత్రువులను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే విడదల రజిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే రజినిని ఆలయ అధికారులు, ధర్తకర్త పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలందరికీ తగిన శక్తిని ఇవ్వాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. మన దేశంపై గెలిచే సత్తా ఎవరికీ లేదని, భారతదేశం ఎప్పటికీ సురక్షితంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఆటుపోట్లు సహజంగా వస్తుంటాయని, వాటిని తట్టుకునేందుకు అందరం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందేనని వెల్లడించారు.
July 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కరోనా విపత్తు నుంచి ప్రపంచం బయటపడాలని ఎమ్మెల్యే రజిని ప్రత్యేక పూజలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

