728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 12, 2020

చిలకలూరిపేట పట్టణంలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడులో నేడు ఉదయం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదుఅయిన విషయం విదితమే. అయితే పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఒక అపార్ట్మెంట్లో ఏకంగా ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు కుమారులు మరియు వారి బంధువు ఇంకొకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం నిర్ధారించారు. వీరిలో ఒకరు ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు ఒక ప్రభుత్వ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పని చేస్తున్నారు. దీంతో చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం ఐదు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE