అమరావతి: ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరిస్తూ వైకాపా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో ఆరు జిల్లాల్లో గురువారం నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మొత్తం 2,200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. గతంలో 1,059 వైద్య ప్రక్రియలకే ఆరోగ్య శ్రీ వర్తించేది.
July 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఇకపై వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

