728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 15, 2020

చిలకలూరిపేటలో కరోనా @ 1125 కేసులు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట పట్టణంలో లాక్ డౌన్ ఎత్తివేసిన 7వ తేదీ నుండి పట్టణంలో కరోనా కేసుల లెక్క చూస్తే 7వ తేదీ 18 కేసులు, 8వ తేదీ 29 కేసులు, 9వ తేదీ 39. అక్కడినుండి అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. 10వ తేదీ 10 కేసులు, 11వ తేదీ 9 కేసులు, 12వ తేదీ 6 కేసులు, 13వ తేదీ 10 కేసులు, 14వ తేదీ కేవలం 6 కరోనా కేసులు మాత్రమే పట్టణంలో నమోదయ్యాయి.

ఈ లెక్కన చూస్తుంటే గత 5 రోజుల నుండి కేవలం 10 లోపు కేసులు మాత్రమే నమోదు అవడంతో పట్టణంలో కేసుల సంఖ్య తగ్గుదల పట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికీ చిలకలూరిపేట పట్టణం మొత్తం మీద 617 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక ఎడ్లపాడు మండలం విషయానికొస్తే 126 కరోనా కేసులు, నాదెండ్ల మండలంలో 232 కరోనా కేసులు, చిలకలూరిపేట రూరల్ లో 150 కేసులు నమోదై మొత్తం నియోజకవర్గం మొత్తం మీద ఈ సంఖ్య 1125 కు చేరుకుంది.

అయితే పట్టణ ప్రాంతంలో కోవిడ్ టెస్టులు నిర్వహించకపోవడం వలన ఈ సంఖ్య తగ్గిందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ టెస్ట్ కిట్లు లేకపోవడం వల్ల తాము టెస్ట్ లు చేయలేకపోతున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ గత 6 రోజుల నుండి పట్టణంలో కేసుల సంఖ్య తగ్గుదల పట్టడంతో కరోనా వైరస్ కొంతమేర తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కరోనా @ 1125 కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE