న్యూఢిల్లీ:
★ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తేది ఖరారైంది.
★ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్లు సమాచారం.
★ తొలి పోరు సెప్టెంబరు 19న ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ నవంబరు 10న జరగనుంది.
★ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఆదివారం జరిగిన పాలక మండలి భేటీలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
★ అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజులపాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
★ చైనా కంపెనీలతో సహా అన్ని స్పాన్సర్లకు ఐపీఎల్ పాలక మండలి అనుమతించింది.
★ సాయంత్రం జరిగే మ్యాచ్‌లు ఎప్పటిలా 7 గంటలకు కాకుండా అర్ధ గంట లేటుగా 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.
★ మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3 గంటల 30 నిమిషాలకు మొదలువుతాయని తెలిపారు.
★ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు త్వరలో పాలక మండలి మరో సారి సమావేశం కానుంది.
★ ఇందులో ప్రధానంగా క్వారంటైన్ నిబంధనలు అనుసరించి బయో బబుల్ శిక్షణ కార్యక్రమాలు, ఆటగాళ్ల వసతి, ప్రయాణలపై చర్చించనున్నారు.
★ అలానే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
★ మొత్తం నాలుగు జట్లు ఇందులో పాల్గొంటాయని తెలిపారు.
★ కొద్ది రోజుల క్రితం ఐపీఎల్ పాలక మండలి ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఐపీఎల్ 13 సీజన్ యూఏఈలో సెప్టెంబరు 13న జరుగుతుందని తెలిపారు.
★ ఇందుకు సంబంధించి బీసీసీ నుంచి అధికారంగా లేఖ తమకు అందినట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.