728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 3, 2020

చిలకలూరిపేట: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పురపాలక సంఘం

చిలకలూరిపేట: ఈ సంవత్సరం మార్చి నెలతో సండ్రీ వసూల్ పాట టైం అయిపోవడంతో చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో పాటను నిర్వహించారు. అయితే, జరుగుతున్న సండ్రీ వేలం పాటను కరోనా పెరుగుతుందన్న కారణంగా అర్ధాంతరంగా నిలిపివేశారు.

అయితే జూన్ 23వ తేదీన ఆర్ఓసీ నెంబర్ 564 /20 20/ఏ2 ప్రకారం టెండర్లు పిలిచారు. దీని ప్రకారం జూన్ 30వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి సమక్షంలో వేలం పాటను ప్రారంభించారు. మొదటగా మాంసం, చేపలు వేలం పాటను 1,55,000 వేల రూపాయలు ఒక వ్యక్తి పాడుకున్నాడు. అనంతరం మార్కెట్టు, సండ్రీ పాటలు నిర్వహించాల్సి ఉండగా అర్ధాంతరంగా పాటను నిలుపుదల చేస్తున్నట్లు రెవెన్యూ అధికారి ప్రకటించి వెళ్లిపోయారు.

అప్పటి నుండి మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన బిల్ కలెక్టర్ ఆధ్వర్యంలో సండ్రీ డబ్బులు మున్సిపల్ వారు వసూలు చేశారు. అయితే మూడు రోజుల క్రితం ROC నెంబర్ 504 /2011/ ఏ1 తేదీ 31.7.2020 ఈ ప్రకారం ఒక పత్రికలో మరలా సండ్రీ వేలం పాటకు టెండర్లు పిలిచారు. సదరు టెండర్లో ఈనెల 7వ తేదీన శుక్రవారం 11 గంటలకు పాట ఉన్నట్లు ప్రకటించారు.

అయితే సండ్రీ వేలంపాట టెండర్ మొదట జూన్ నెల 23వ తేదీన పత్రికలో ప్రకటన ఇచ్చి 30వ తేదీన పాట పాడుతూ అర్ధాంతరంగా రెవెన్యూ అధికారి నిలిపివేసి కరోనా పెరిగిపోతున్న కారణంగా సండ్రీ నిలుపుదల చేస్తున్నామని ఈ వేలం పాటకు వచ్చిన వారందరికీ ఫోన్ చేసి తెలియపరిచి మరలా పాటలో పాల్గొనేలా చేస్తామని ప్రకటించి వెళ్లిపోయారు.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే... ఫోను ద్వారా తెలియ చేస్తాము అని చెప్పిన సదరు అధికారి జులై 31వ తేదీన ఒక పత్రికలో టెండర్ ప్రకటన ఇచ్చి ఆగస్ట్ 7వ తేదీన వేలంపాట నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అటువంటప్పుడు వేలంపాట నిర్వహించేటప్పుడు గతంలో ఆ వేలం పాటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించకుండా మరలా కొత్తగా టెండర్లు వేలంను పిలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదియును గాక ఆ రోజు కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా పాట నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ రోజు నాటికి సుమారు 30 కరోనా కేసుల్లోపే ఉన్నాయి. కానీ పట్టణంలో నేడు ఆ కేసుల సంఖ్య 435 చేరింది. మరి ఆరోజు కరోనా కేసులు పెరుగుతున్నాయని వాయిదా వేసిన అధికారులు ఈరోజు 435 కరోనా కేసులు, పట్టణంలో పెరుగుతున్న పాట నిర్వహించడం ఏమిటని, ఒకటికి రెండు సార్లు పత్రికల్లో టెండర్ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇంటి పన్ను తదితర పన్నులు వసూలు చేసి ప్రజల సంక్షేమం కోసం పాటు పడవలసిన మున్సిపల్ అధికారులు... పొంతన లేకుండా మాట్లాడి రెండు సార్లు టెండర్ ప్రకటనలు ఇచ్చి అధిక డబ్బులు దుబారా చేస్తూ ఈ విధంగా టెండర్ ప్రకటనలు ఇచ్చి మున్సిపల్ ధనాన్ని దుర్వినియోగం చేయడంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టవలసిందిగా పలువురు పుర ప్రజలు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పురపాలక సంఘం Rating: 5 Reviewed By: NEWS UPDATE