728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 15, 2020

భారత్‌లో కరోనా: 25 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ:
★ భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

★ గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

★ తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది.

★ దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

★ 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది.  ప్రతిరోజు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి.

★ తాజాగా 996 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 49,036కి చేరింది.

★ కొవిడ్‌ నుంచి తాజాగా 57,381 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 18,08,936కి చేరింది.

★ ప్రస్తతుం 6,68,220 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో కరోనా: 25 లక్షలు దాటిన కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE