అమరావతి: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను అమలు చేస్తూ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.
దీంతో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ మొదలయినట్టే. కేంద్ర మార్గదర్శకాల ప్రకార ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు లేనట్టే.. అలానే సినిమా హాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు తెరుచుకోడానికి కూడా అవకాశం లేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి ఇచ్చారు.
స్వతంత్రదినోత్సవ వేడుకలు కూడా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు ఉత్తరువుల్లో పేర్కొన్నారు.