గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అధికారులు రెండోవిడత లాక్‌డౌన్ ను పొడగించారు. ఇది శుక్రవారంతో ముగియనుంది. అయితే కరోనా కేసుల విషయంలో తగ్గుదల ఏమాత్రం కనిపించకపోవటం విశేషం. ప్రజలు, వ్యాపారస్తుల నిర్లక్ష్యం కరోనా విజృంభనకు కారణంగా చెబుతున్నారు.
కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని సూచనలు చేశాయి. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వినియోగం పాటించటంతో వ్యాది వ్యాప్తిని నిరోధించవచ్చు. అయితే చిలకలూరిపేటలో ఆ విధంగా జరుగుతుందా..? అన్నదే ఇప్పటి ప్రశ్న. ఈ కోణం నుంచే లాక్ డౌన్ అమలులో ఉన్నా వ్యాధిని తీవ్రత బలంగాఉండటానికి కారణాలు కూడా అన్వేషించాల్సి ఉంటుంది.
లాక్ డౌన్ అంటే ప్రజలు అత్యవసరం అనుకుంటే మినహ బయటకు రాని పరిస్థితి. ఎవరికి వారే స్వీయనియంత్రణతో మెలగాల్సిన సమయం. ఇలా ప్రజలు బయటకు రాకుండా ఉంటే వాస్తవంగా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఒకరి నుంచి మరోకరి వ్యాధివ్యాపించదు. కాని ఇందుకు విరుద్దంగా ఎందుకు జరుగుతుందన్నదే సామాన్యుల్లో ఉదయంచే ప్రశ్న. ఇందులో కొంతమంది అధికారుల పాత్ర ఎంత ఉందో.. ప్రజల నిర్లక్ష్యం కూడా అంతే ఉంది.
గతంలో ఎక్కడైనా కరోనా బాధితుడు ఉంటే ఆయా ప్రాంతాలను మున్సిపల్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని రాకపోకలు జరగకుండా కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసేవారు. కాని రానురాను ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ల పరిధిని తగ్గించి వేసిందో ఇదే స్థానిక అధికారులకు వరంగా మారింది. దీంతో వారు పూర్తిగా చేతులేత్తేసారు. కేసులు నమోదౌతున్నా ప్రాంతాలలో కనీస పారిశుధ్య పనులు కూడా నిర్వహించకుండా, ఆయా ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయకుండా చేతులెత్తేసారు. ఇంకేముంది ఆ ప్రాంతాలలో నుంచి ప్రజలు బయటకు రావటం, వీధుల్లో సంచరించటంతో కేసుల సంఖ్య పెరగటానికి కారణంగా చెప్పవచ్చు.
ఇందుకు ఆయా ప్రాంతాలలో ప్రజలు చెప్పే సమాధానం కూడా ఆలోచించదగ్గదే. తమ కంటైన్మెంట్ జోన్లలో కనీసం తమను పట్టించుకోకపోవటంతో తప్పని సరిగా బయటకు రావల్సివస్తుందని చెబుతున్నారు. ఇక్కడ తప్పు ఎవరిదో అర్దం చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే వ్యాపారులు కూడా పరోక్ష కరోనా వ్యాప్తికి దోహదం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంతోనే సంపూర్ణ లాక్డౌన్‌లో వారు దుకాణాలు తెరవటానికి అవకాశం ఇవ్వలేదు.
అయితే ఇప్పడు అధికారులు నరసరావుపేట, వినుకొండలో మాదిరి వ్యాపారులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ రిపోర్టు వస్తేనే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా అధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం.ఈ క్రమంలో లాక్డౌన్ తిరిగి పొడిగించి, సడలింపుల్లో భాగంగా సమయం పెంచాలని యోచిస్తున్నారు.