చిలకలూరిపేట: కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది, ఊరువాడా విస్తరించింది. అయితే ఈ కరోనా కొంతమంది వైద్యులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం కరోనా పేషెంట్లకు చికిత్స చేయడానికి కొన్ని నిర్దేశికాలను విడుదల చేసింది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయటానికి తప్పనిసరిగా జిల్లా వైద్యాధికారుల పర్మిషన్ తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ సంబంధించిన పర్మిషన్ కూడా ఉండి ఉండాలి. కరోనా పేషెంట్లకు చికిత్స చేయడానికి తప్పనిసరిగా పీ.పీ.ఈ కిట్లను ధరించడం ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలిసిన ట్రైనింగ్ పొందిన వైద్యుడు తప్పనిసరిగా ఉండాలి.
అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.... చిలకలూరిపేట పట్టణంలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత కొద్ది రోజుల నుండి గుట్టుచప్పుడు కాకుండా కొంత మంది కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు వైద్యం అందించి, రెండు లక్షల రూపాయల వరకూ ముక్కుపిండి మరీ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి చుట్టుపక్కల నివాసం ఉండేవారు ఈ పేషెంట్లకు చికిత్స అందించడం వల్ల ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడూ రద్దీగా ఉండే ఆసుపత్రిలో బయటకు ఎవరినీ రానివ్వకుండా బయట గేటు తాళాలు వేసి దొడ్డిదారిన పేషెంట్లను అనుమతించి వైద్యం చేయడం పై పలువురు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు వెంటనే విచారణ జరిపించి వలసిందిగా స్థానికులు కోరుతున్నారు.