విజయవాడ: తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ‘‘టెస్టులు, ఫలితాలతో సంబంధం లేకుండా ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఆదేశించాం. 94శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉన్న వారు వాలంటీర్, ఏఎన్‌ఎంకు చెప్పాలి. లేదా 104 నెంబరుకు కాల్ చేయాలి. చివరి నిమిషంలో ఆస్పత్రికి వస్తే కోలుకోవడం కష్టం అవుతుంది. అలానే కరోనా మరణాలు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఆస్పత్రి పడకల గురించి హెల్ప్ డెస్క్‌లో తెలుసుకోవచ్చు’’ అని జవహర్ రెడ్డి తెలిపారు.
August 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చివరి నిమిషంలో ఆస్పత్రికి వస్తే కష్టం: జవహర్ రెడ్డి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

