చిలకలూరిపేట: పట్టణంలో 7576 మంది లబ్ధిదారులకు ఈ నెల 15వ తేదీన ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ప్లాట్ల ఎంపికకు సంబంధించిన లాటరీని శనివారం ఎమ్మెల్యే కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం నిర్మించి ఇవ్వబోతున్న పేదల కాలనీలు గతంలోలా పేలవంగా ఉండవని తెలిపారు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలను పేదలకు ఇవ్వనున్న ప్లాట్లలో ప్రభుత్వం కేటాయించిందన్నారు. అర్హత ఉండి ఇంటి స్థలం రాని వారు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటుకల్పించిందని చెప్పారు.
పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా ఇళ్ల స్థలాల ఎంపిక జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు తెల్ల కార్డే అర్హతగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు చెప్పారు. విక్రయ దస్తావేజుల రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీల్లో 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు నిర్మించనున్నారని, విశాలమైన రోడ్ల నిర్మాణానికి స్థలాలు వదిలేసి ప్లాట్లు వేస్తున్నారని చెప్పారు. అధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న పెద్ద లేఅవుట్ల(కాలనీల)లో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఖాళీ స్థలాలు వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమది కాదని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉంటాయని చెప్పారు. బెడ్ రూమ్, పెద్ద హాలు, కిచెన్, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్తు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 13 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించ ఇవ్వబోతోందన్నారు. 5528 మందికి టిడ్కోలో, 7576 మందికి పసుమర్రు లేఅవుట్‌లో ఇళ్ల ఇస్తున్నామన్నారు. చిలకలూరిపేట పట్టణంలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట పట్టణ పరిధిని దిగ్విజయంగా పెంచుకోగలిగామని చెప్పారు. గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రుగ్రామాలు చిలకలూరిపేటలో విలీనమయ్యాయమన్నారు. త్వరలోనే స్పెషల్ గ్రేడ్ హోదాను కూడా చిలకలూరిపేట పట్టణం దక్కించుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.