న్యూఢిల్లీ:
★ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్' ప్రణాళిక అమలులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
★ తమ ప్రభుత్వ అత్యంత ప్రాథమ్యాల్లో ఈ పథకం ఒకటని పేర్కొంది.
★ ఈ పథకం అమలులోకి వస్తే ఆహార భద్రతా చట్టంలో భాగంగా అర్హులైన రేషన్ కార్డుదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ పొందవచ్చునని కేంద్ర ఆహార వ్యవహారాలశాఖ వెల్లడించింది.
★ ఈ నెల ఒకటో తేదీ నుంచి 24 రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతున్నదని, అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం అమలు చేసేందుకు అంగీకరించాయని తెలిపింది.
★ ఈ పథకంలో భాగంగా రేషన్‌కార్డు కలిగినవారికి ప్రతినెల 5 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయని, దీనివల్ల దేశంలోని 80 కోట్ల మందికి లబ్దిచేకూరుతుందని వెల్లడించింది..