728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 20, 2020

ఇస్రో ప్రైవేటుపరంపై స్పందించిన చైర్మన్ శివన్

న్యూఢిల్లీ:
★ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు ఆ సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారం నాడు తోసిపుచ్చారు.

★ అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, ఇస్రో ప్రైవేటుపరం కాదని ఆయన స్పష్టం చేశారు.

★ అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణల ప్రకటన ప్రైవేటీకరణకు ఉద్దేశించినది ఎంతమాత్రం కాదని ఆయన చెప్పారు.

★ 'ప్రభుత్వం స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారు. అలాంటిదేమీ లేదు. ఇస్రో ప్రైవేటుపరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను' అని శివన్ పేర్కొన్నారు.

★ ప్రైవేటు వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా మెకానిజం ఉంటుందని, లేదంటే ఇస్రోనే ఆ పని నిర్వహిస్తుందని వివరించారు.

★ భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో నిజమైన గేమ్-చేంజర్‌‌గా సంస్కరణలు ఉండబోతున్నాయని చెప్పారు.

★ ప్రతిపాదిత స్పేస్ యాక్టివిటీ బిల్లు ముసాయిదా దాదాపు తుది దశలో ఉందని, త్వరలోనే ఆమోదం కోసం కేబినెట్ ముందుకు వస్తుందని చెప్పారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇస్రో ప్రైవేటుపరంపై స్పందించిన చైర్మన్ శివన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE