చిలకలూరిపేట: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుభాని డిమాండ్ చేసారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గుంటూరులో ఎల్ఐసి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం దేశ ప్రజల రక్తమాంసాలతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించుకుంటే ఆర్ఎస్ఎస్ ఆధీనంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారు చౌకగా తెగనమ్మి దేశంలో ప్రజలకు కష్టాలు సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందని అన్నారు.
హిందుస్థాన్ పెట్రోలియం, గేల్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగం, బొగ్గు గనులు సమస్తం దేశ విదేశీ కార్పొరేటలకు అడ్డంగా దోచి పెట్టడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుందని, ఇప్పటికే భారత రక్షణ శాఖలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో 70శాతం రక్షణ శాఖను కూడా ప్రైవేటీకరణ చేసే యోచనలో ఉందని అన్నారు.