అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,490 మందికి పరీక్షలు నిర్వహించగా 10,004 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,771 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,276 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,772 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 3,30,526 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 85 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,969 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,22,912 శాంపిల్స్ ని పరీక్షించారు.
August 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొనసాగుతున్న కరోనా కేసుల తీవ్రత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

