728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 17, 2020

చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం

చిలకలూరిపేట: రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే కమిటీ పిలుపుమేరకు చిలకలూరిపేటలో చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో 63వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం ఆంధ్రజ్యోతి ఆవిర్భావం నుండి పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నార్న్  బాబ్జీరావును ఘనంగా సన్మానించారు.


డిగ్రీ ఫైనల్ ఇయర్1992లొనే స్టేట్ ఈవినింగ్ సాయంకాల దినపత్రికలో విలేకరిగా తన ప్రస్థానాన్ని సాగిస్తూ టీవీ9, వార్త, ఆంధ్రప్రభ, సూర్య, సాక్షి, వివిధ దినపత్రికల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు, చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ అల్లాబక్షును సన్మానించారు.


ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్ వలి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి  NVSV ప్రసాద్, కోశాధికారి పిట్టల శీను, దీవి దాసు, రాంజీ నాయక్, శ్రీను నాయక్, దరియా, శ్యాం, సాయి తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం Rating: 5 Reviewed By: NEWS UPDATE